

తిరుమలలోని మాధవనిలయంలో ఉగ్రవాద దాడి జరిగినట్లుగా ఊహాత్మక పరిస్థితిని సృష్టించి ఆక్టోపస్ కమాండోలు, స్థానిక పోలీసులు సంయుక్తంగా భారీ మాక్ డ్రిల్ నిర్వహించారు. టీటీడీ ఈవో, ఛైర్మన్ మరియు చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ (సివిఎస్ఓ) అనుమతితో నిర్వహించిన ఈ డ్రిల్‌లో ఉగ్రవాదులు మాధవనిలయంలోకి చొరబడి యాత్రికులు, సిబ్బందిపై కాల్పులు జరిపి కొంతమందిని బందీలుగా తీసుకున్నట్లు సిమ్యులేషన్ రూపొందించారు.
అనంతరం ఆక్టోపస్, పోలీసులు, ఫైర్ సర్వీసులు, మెడికల్, ట్రాఫిక్, ఎస్పీఎఫ్ బృందాలు సమన్వయంతో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి బందీలను సురక్షితంగా రక్షించినట్లు మాక్ ఆపరేషన్ పూర్తి చేశారు. ఆక్టోపస్ చార్లీ టీమ్ డీఎస్పీ బి. రాంబాబు పర్యవేక్షణలో జరిగిన ఈ డ్రిల్‌లో టీటీడీ విజిలెన్స్ సిబ్బంది కూడా పాల్గొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో శాఖల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడం, యాత్రికుల భద్రతను మరింత బలోపేతం చేయడం, వేగవంతమైన స్పందన సామర్థ్యాన్ని పరీక్షించడం ఈ మాక్ డ్రిల్ ప్రధాన ఉద్దేశ్యమని అధికారులు తెలిపారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!