

ప్రముఖ గ్లోబల్ మెమరీ చిప్ తయారీ సంస్థ మైక్రాన్ టెక్నాలజీ తైవాన్‌లోని తమ ప్లాంట్ ఉద్యోగులకు రికార్డు స్థాయి బోనస్ ప్యాకేజీని ప్రకటించింది. రాయిటర్స్ నివేదిక ప్రకారం, యూనియన్ల సమ్మె హెచ్చరికల నేపథ్యంలో గ్లోబల్ చిప్ మార్కెట్ వృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఉద్యోగులకు కనీస నగదు పరిహారంగా రూ.45 లక్షలకు పైగా (NT$1.7 మిలియన్లు) అందించేందుకు సంస్థ నిర్ణయించింది. ఈ బోనస్ 35 నుంచి 68 నెలల వేతనానికి సమానంగా ఉంటుందని సమాచారం.
2025 ఆగస్టు 29లోపు సంస్థలో చేరిన ఉద్యోగులకు అదనంగా మరో రూ.26 లక్షల (NT$1 మిలియన్) ప్రత్యేక బోనస్ కూడా లభించనుంది. యూనియన్ల నుంచి సమ్మె హెచ్చరికలు వస్తున్న సమయంలో మైక్రాన్ ప్రకటించిన ఈ భారీ ప్రోత్సాహక ప్యాకేజీ ప్రాధాన్యత సంతరించుకుంది. చిప్ పరిశ్రమలో పెరుగుతున్న డిమాండ్, మార్కెట్ వృద్ధి నేపథ్యంలో ఉద్యోగులను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!