
క్రీడలు

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం పతంజలి గ్రూప్ త్వరలో ‘పతంజలి సివిల్ సర్వీసెస్ అకాడమీ’ని ప్రారంభించనున్నట్లు బాబా రామ్‌దేవ్ ప్రకటించారు. హరిద్వార్‌లోని పతంజలి యోగపీఠ్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ విషయాన్ని వెల్లడిస్తూ, యువతకు నాణ్యమైన శిక్షణ అందించడమే లక్ష్యమని తెలిపారు.
ఈ అకాడమీకి ప్రముఖ ఉపాధ్యాయుడు అవధ్ ఓజా నాయకత్వం వహించనున్నారు. యూపీఎస్సీ కోచింగ్ రంగంలో ఆయనకు విశేష గుర్తింపు ఉంది. ఎంఏ చదివే విద్యార్థులకు లక్ష రూపాయల లోపే ఫీజు ఉండగా, బయటి నుంచి వచ్చే విద్యార్థులకు సుమారు ₹2.5 లక్షల ఫీజు ఉంటుందని రామ్‌దేవ్ తెలిపారు. ఇప్పటికే వేలాది మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన ఓజా, అనేక మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను తీర్చిదిద్దారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!