
సినిమాలు

రాజమహేంద్రవరంలో మద్యం మత్తులో యువకులు నిర్లక్ష్యంగా కారు నడిపి ఢీకొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడిన పీజీ వైద్య విద్యార్థిని డా. ప్రియాంక మృతి పట్ల ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భవిష్యత్తులో వైద్యురాలిగా ఎంతోమందికి సేవలు అందించాల్సిన ఆమె అర్థాంతరంగా మృతి చెందడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు.
నిర్లక్ష్యంగా వాహనం నడిపి నిండు ప్రాణాన్ని బలిగొన్న నిందితులకు కఠిన శిక్షలు పడేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పవన్ కల్యాణ్ తెలిపారు. డా. ప్రియాంక ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!