
రాజకీయాలు

విజయవాడకు చెందిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బుధవారం జరిగిన విచారణలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న ఈ కేసుకు సంబంధించిన విచారణపై స్టే విధించింది. హైకోర్టులో ఉన్న అన్ని పిటిషన్లను తమకు బదిలీ చేయాలని ఆదేశించింది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ నెల 30లోగా సీల్డ్ కవర్‌లో సమర్పించాలని సూచించింది.
ఈ కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తు కొనసాగిస్తోంది. ఇటీవల సిట్ సమర్పించిన రిమాండ్ నివేదికలో సాయికృష్ణ మృతి, అనంతరం మృతదేహానికి సంబంధించిన పరిణామాలపై పలు అంశాలను పేర్కొంది. తాజాగా సుప్రీంకోర్టు కేసును తన పరిధిలోకి తీసుకోవడంతో తదుపరి విచారణను అక్టోబర్ 12కు వాయిదా వేసింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!