

తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. సెప్టెంబర్ 7న ప్రారంభమైన సమావేశాలు ఎనిమిది రోజుల పాటు కొనసాగి, సెప్టెంబర్ 18న ముగిశాయి. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సభను నిరవధికంగా వాయిదా వేశారు. మొత్తం 51 గంటల 52 నిమిషాల పాటు సభా కార్యక్రమాలు జరిగాయి. సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చలు జరిగాయి. 22-ఏ నిషేధిత జాబితాలోని భూములు, నీటి లభ్యత, వ్యవసాయం, విద్యుత్, రహదారులు, ప్రజా సమస్యలు తదితర అంశాలు సభలో ప్రస్తావనకు వచ్చాయి. నాలుగు బిల్లులకు ఆమోదం లభించగా, పలు అంశాలపై స్వల్పకాలిక చర్చలు జరిగాయి.
సమావేశాల చివరి రోజు ఎల్‌నినో ప్రభావం–నివారణ చర్యలపై సభలో చర్చ జరిగింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన తీర్మానాన్ని శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఎల్‌నినో, వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్రం నుంచి రూ.20 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ, రైతులకు పంట నష్టపరిహారం, ఇన్‌పుట్ సబ్సిడీ, అదనంగా 50 రోజుల ఉపాధి, 1,500 మెగావాట్ల అదనపు విద్యుత్, 50 లక్షల టన్నుల బొగ్గు కేటాయింపును కోరింది. తాగునీరు, సాగునీరు, చెరువుల పునరుద్ధరణ, భూగర్భ జలాల పెంపు కోసం కూడా కేంద్ర సహాయం కోరింది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర FRBM రుణ పరిమితిని GSDPలో 3 శాతం నుంచి 3.5 శాతానికి పెంచాలని విజ్ఞప్తి చేసింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!