
సినిమాలు

పవన్ కళ్యాణ్ నిరంజన్ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో జీవితంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామిని ప్రార్థించినట్లు వెల్లడించిన ఆయన, భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు కూడా నిరంజన్‌పై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు. నిరంజన్ ధైర్యం అతను ఎదుర్కొంటున్న కష్టాల కంటే గొప్పదని పేర్కొంటూ, త్వరలోనే అతడిని చిరునవ్వుతో చూడాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
అదే సమయంలో తన వరంగల్, హనుమకొండ పర్యటనకు సహకరించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం, పోలీసు శాఖ అధికారులకు పవన్ కళ్యాణ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రజలు తనపై చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయత, అభిమానానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, వారి ఆశీర్వాదాలు తనకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!