

పూణెలో సంచలనం సృష్టించిన కేతన్ అగర్వాల్ హత్య కేసులో పోలీసులు 5,300 పేజీల ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఇందులో హత్యకు ముందు నిందితులు కేతన్‌ను బెంగళూరుకు తీసుకెళ్లి అతని కాళ్లు, చేతులు విరగ్గొట్టాలని తొలుత ప్రణాళిక వేసినట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రధాన నిందితుల్లో ఒకరైన రితేష్ హంగే బెంగళూరులోని ఓ స్నేహితుడితో చర్చించినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. అయితే, ఆ స్నేహితుడు ఈ ఆలోచనను వ్యతిరేకించినట్లు పోలీసులు తెలిపారు.
అనంతరం నిందితులు స్వయంగా కేతన్‌ను హత్య చేయాలని నిర్ణయించుకున్నారని, ఇందుకోసం హత్యలకు సంబంధించిన సినిమాలు చూసి, ప్రణాళిక రూపొందించేందుకు చాట్‌జీపీటీని ఉపయోగించినట్లు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. పోలీసులకు చిక్కకుండా తప్పించుకునే మార్గాలపై పాడ్‌కాస్ట్‌లు కూడా విన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. జూన్ 6న వివాహానికి ముందు ఫోటోషూట్‌కు వెళ్తున్న సమయంలో కేతన్ పాస్‌పోర్ట్‌ను చింపి కేఫ్ వాష్‌రూమ్‌లో పడేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం ‘మహి’ పేరుతో నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను సృష్టించి, కేతన్‌ను జూన్ 18న లోహ్‌గఢ్ కోటకు రప్పించేందుకు సందేశాలు పంపినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఘటన అనంతరం ఆ ఖాతాను తొలగించినట్లు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!