
జనరల్

ప్రధాని నరేంద్ర మోదీ నేడు, రేపు కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. కర్ణాటక పర్యటనలో భాగంగా బెంగళూరులో సుమారు రూ.15,600 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. రవాణా, విద్యుత్, రైల్వే రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. నగరంలో బెంగళూరు మెట్రో పింక్ లైన్‌ను ప్రారంభించడంతో పాటు ప్రశాంతి కుటీరం స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు.
అనంతరం మంగళూరులో భూగర్భ ఎల్‌పీజీ నిల్వ కేంద్రాన్ని, నాలుగు అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను ప్రధాని ప్రారంభించనున్నారు. కర్ణాటక పర్యటన ముగించుకుని రేపు గుజరాత్‌కు వెళ్లనున్నారు. అక్కడి ప్రసిద్ధ అంబాజీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ రెండు రోజుల పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలతో పాటు వివిధ కార్యక్రమాల్లో మోదీ పాల్గొననున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!