

అగ్రికల్చర్ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం భారత్‌పై ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు. ఈ సంక్షోభం కారణంగా డీజిల్ ధరను రూ.50 వరకు పెంచాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ, ప్రభుత్వం కేవలం రూ.7 మాత్రమే పెంచిందని వెల్లడించారు. దేశంలోని ప్రతి రంగానికి సౌరవిద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇంధన అవసరాలను తీర్చడంతో పాటు ప్రత్యామ్నాయ ఇంధన వనరులను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
మరోవైపు, దేశంలో వ్యవసాయ రంగం గణనీయమైన పురోగతి సాధిస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. వ్యవసాయ ఎగుమతులు రూ.4 లక్షల కోట్లకు చేరుకున్నాయని వెల్లడించారు. రైతుల ఆదాయం పెరిగిందని, తేనె ఉత్పత్తి కూడా గతంతో పోలిస్తే రెట్టింపు అయ్యిందని తెలిపారు. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు రైతులకు మెరుగైన ఆదాయ అవకాశాలు కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని మోదీ పేర్కొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!