

తిరుమలలో భక్తులకు మరింత నాణ్యమైన సేవలు అందించడం, క్షేత్ర పవిత్రతను పరిరక్షించడం, శాంతిభద్రతలను బలోపేతం చేయడం లక్ష్యంగా పోలీసు, విజిలెన్స్, సెక్యూరిటీ శాఖల ఆధ్వర్యంలో స్థానిక దుకాణాల యజమానులతో ఆస్థాన మండపంలో అవగాహన సమావేశం నిర్వహించారు. భక్తుల సంక్షేమం, మత సామరస్యం, భద్రతా ప్రమాణాల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అధికారులు సూచించారు.
దుకాణాల వద్ద ధరల ప్రదర్శన బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయడం, అగ్నిమాపక భద్రతా నిబంధనలు పాటించడం, సిబ్బంది పూర్తి వివరాలను అధికారులకు అందించడం, నేర చరిత్ర పరిశీలన అనంతరం మాత్రమే నియామకాలు చేపట్టడం వంటి అంశాలపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. తిరుమల పవిత్రత, భక్తుల మనోభావాల పరిరక్షణలో పూర్తి సహకారం అందిస్తామని దుకాణాల యజమానులు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో సుమారు 350 మంది దుకాణాల యజమానులు, పోలీసు మరియు విజిలెన్స్ అధికారులు పాల్గొన్నారు













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!