

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుటుంబంతో యూరప్‌లో సెలవులు ముగించుకుని మళ్లీ షూటింగ్‌లపై పూర్తి దృష్టి పెట్టినట్లు సమాచారం. ప్రస్తుతం ‘రాకా’ సినిమా కొత్త షెడ్యూల్ ముంబైలో ప్రారంభమైనట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాదిలోనే చిత్రీకరణ పూర్తి చేసేలా చిత్రబృందం ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. విడుదల తేదీపై అధికారిక ప్రకటన రాకపోయినా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తైన తర్వాత వచ్చే వేసవి అనంతరం సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్లు సమాచారం.
‘రాకా’ పూర్తయ్యాక దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో అల్లు అర్జున్ మరో భారీ ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలుస్తోంది. తక్కువ వ్యవధిలో చిత్రీకరణ పూర్తి చేసి పరిమిత బడ్జెట్లో సినిమాను సిద్ధం చేయాలనే లక్ష్యంతో బృందం పనిచేస్తోందని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 2027లో విడుదల చేయాలని భావిస్తున్నప్పటికీ, పరిస్థితులను బట్టి సంక్రాంతి 2028కు వాయిదా పడే అవకాశమూ ఉందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అన్నీ అనుకున్నట్లే జరిగితే 2027లో అల్లు అర్జున్ నుంచి రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!