
జనరల్

బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఇంటిపై దుండగులు పెట్రోల్ బాంబులతో దాడి చేసి భయాందోళనలు సృష్టించారు. బుధవారం రాత్రి మోటార్ సైకిళ్లపై వచ్చిన దుండగులు ఈ దాడి జరిపినట్లు సమాచారం. మాజీ ప్రధాని షేక్ హసీనా నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో షకీబ్ వర్చువల్‌గా పాల్గొనడమే ఈ దాడికి కారణమని భావిస్తున్నారు. ఘటన సమయంలో ఆయన కుటుంబ సభ్యులు ఇంట్లో లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
స్థానికులు వెంటనే స్పందించి మంటలను ఆర్పివేయడంతో పెద్ద నష్టం తప్పింది. పోలీసులు ఇంటి వద్ద భద్రత పెంచారు. మరోవైపు హసీనా కుమారుడు సాజీబ్ వాజెద్ బంగ్లాదేశ్ పరిస్థితులపై తీవ్ర విమర్శలు చేస్తూ, దేశం మరో పాకిస్థాన్‌లా మారుతోందని ఆరోపించారు. విదేశీ ఇంటెలిజెన్స్ ప్రభావంపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!