

సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బహిరంగ సభల నిర్వహణకు కసరత్తు చేస్తోంది. ఈ రెండు నియోజకవర్గాలు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాలు కావడంతో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సెప్టెంబర్ చివరిలో సిరిసిల్లకు, అక్టోబర్‌లో సిద్దిపేటకు వస్తానని సీఎం రేవంత్ రెడ్డి సెప్టెంబర్ 5న నకిరేకల్ సభలో ప్రకటించారు.
ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 30న సిరిసిల్లలో బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అనంతరం అక్టోబర్ మొదటి వారంలో సిద్దిపేటలో మరో సభ నిర్వహించే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది. సభల ఏర్పాట్లను చేపట్టాలని టీపీసీసీ నాయకత్వం జిల్లా కాంగ్రెస్ కమిటీలను ఆదేశించినట్లు సమాచారం. సిద్దిపేటలో భూ వ్యవహారాలపై కాంగ్రెస్ నేతలు పర్యటించడం, దీనిపై హరీశ్‌రావు స్పందించడం వంటి పరిణామాల మధ్య ఈ సభల ప్రణాళికలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!