

గ్రేట్ నికోబార్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ₹81,000 కోట్ల మెగా అభివృద్ధి ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా రాజకీయ వివాదం నెలకొంది. ఈ ప్రాజెక్ట్ వల్ల దట్టమైన అడవులు నాశనం అవుతాయని, షోంపెన్ గిరిజన తెగలకు ప్రమాదం ఉందని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించారు. “గ్రీన్ ఓవర్ గ్రీడ్” నినాదంతో ఆయన ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు.
ఇక ప్రాజెక్ట్‌లో కీలక మార్పులు చేస్తూ రక్షణ మంత్రిత్వ శాఖ INS బాజ్ విస్తరణ ప్రతిపాదనను రద్దు చేసింది. దానికి బదులుగా చింగెన్ గ్రామం సమీపంలో ₹13,000 కోట్ల వ్యయంతో కొత్త గ్రీన్‌ఫీల్డ్ సివిల్ మిలిటరీ ఎయిర్‌పోర్ట్ నిర్మించాలని నిర్ణయించింది.
ఈ ఎయిర్‌పోర్ట్ మిలటరీతో పాటు పౌర విమానయానానికి కూడా ఉపయోగపడనుంది. పర్యావరణానికి తక్కువ నష్టం కలిగేలా, అలాగే హిందూ మహాసముద్రంలో భారత వ్యూహాత్మక స్థితిని బలోపేతం చేసేలా ఈ ప్రాజెక్ట్ రూపొందించబడిందని అధికారులు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!