

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి కేరళలో ప్రతిష్ఠాత్మక ఆర్యదాన్ ముహమ్మద్ 2026 బెస్ట్ పబ్లిక్ సర్వెంట్ అవార్డు లభించింది. శుక్రవారం నిలంబూరులో జరిగిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ఈ పురస్కారాన్ని అందుకున్నారు. దివంగత కేరళ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి ఆర్యదాన్ ముహమ్మద్ స్మారకార్థం ఏర్పాటు చేసిన ఈ అవార్డును రైతులు, వెనుకబడిన వర్గాలు, ఇతర సామాజిక వర్గాలు, సామాన్య ప్రజల సంక్షేమం కోసం తెలంగాణలో చేపట్టిన కార్యక్రమాలు, నాయకత్వం, ప్రజాస్వామ్య విలువల పట్ల నిబద్ధతను గుర్తిస్తూ ఎంపిక చేసినట్లు ఫౌండేషన్ తెలిపింది. ఈ పురస్కారంలో రూ.లక్ష నగదు, ప్రశంసాపత్రం, జ్ఞాపిక ఉన్నాయి.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆర్యదాన్ ముహమ్మద్ పేరుతో ఏర్పాటు చేసిన అవార్డును అందుకోవడం గౌరవంగా ఉందన్నారు. ప్రజాసేవ, లౌకిక విలువల కోసం ఆర్యదాన్ ముహమ్మద్ చేసిన కృషిని ఆయన గుర్తు చేసుకున్నారు. కేరళ రాజకీయాలకు దేశ రాజకీయాల్లో ప్రత్యేక ప్రాధాన్యం ఉందని పేర్కొంటూ, రాహుల్‌గాంధీ నాయకత్వంపై తన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన అవసరం ఉందని అన్నారు. కేరళలో తాను ప్రస్తావించిన రాజకీయ మార్పు దేశవ్యాప్తంగా విస్తరించాలని ఆయన ఆకాంక్షించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!