

బ్రెజిల్‌లోని రియో డి జెనిరోలో గగనతలంలో రెండు హెలికాప్టర్లు ఢీకొన్న విషాద ఘటనలో ప్రముఖ సింగర్‌తో పాటు ఆరుగురు మృతి చెందారు. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఈ హెలికాప్టర్లు నగరానికి పశ్చిమ ప్రాంతంలో కూలిపోయాయి. వాటిలో ఒకటి కార్ డీలర్‌షిప్ పార్కింగ్ ప్రదేశంలో పడటంతో అక్కడ పార్క్ చేసిన ఎలక్ట్రిక్ వాహనాలకు మంటలు అంటుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మృతదేహాలు తీవ్రంగా కాలిపోవడంతో గుర్తించడం కష్టమైందని అధికారులు తెలిపారు. ప్రయాణికుల జాబితా ఆధారంగా వారి వివరాలు వెల్లడయ్యాయి.
మృతుల్లో 32 ఏళ్ల అమెరికన్ సింగర్ ఒలివర్ ట్రీ కూడా ఉన్నారు. ప్రపంచ టూర్‌లో భాగంగా బ్రెజిల్‌కు వచ్చిన ఆయన తన ప్రత్యేక హెయిర్‌స్టైల్‌తో యువతలో మంచి గుర్తింపు పొందారు. స్పాటిఫైలో ఆయన పాటలకు నెలకు 11 మిలియన్ల మంది శ్రోతలు ఉన్నారు. ఈ టూర్‌లో 30 దేశాల్లో 70 ప్రదర్శనలు ఇవ్వాల్సి ఉండగా, ఆదివారం ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనకు ముందు చేసిన చివరి వీడియో కాల్, చివరి ఫొటో భావోద్వేగాన్ని మరింత పెంచుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!