
జనరల్

ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్‌లోని తెలుగు ప్రవాసులకు పిలుపునిచ్చారు. ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు లండన్‌లో తెలుగు ప్రవాసులతో సమావేశమై తెలంగాణ అభివృద్ధి, భవిష్యత్ ప్రగతిపై చర్చించారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ప్రవాసులు కూడా భాగస్వాములు కావాలని సీఎం కోరారు. తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను ప్రపంచవ్యాప్తంగా బలంగా ప్రచారం చేస్తూ రాష్ట్రానికి మంచి రాయబారులుగా నిలవాలని సూచించారు. రాష్ట్రంలో ఉన్న అభివృద్ధి అవకాశాలు, ప్రగతి కార్యక్రమాలను ప్రపంచానికి తెలియజేయడంలో ప్రవాసులు కీలక పాత్ర పోషించాలని అన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!