

2013లో మోహన్‌లాల్, దర్శకుడు జీతూ జోసెఫ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘దృశ్యం’తో ప్రారంభమైన ఈ ఫ్రాంచైజీ మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈ సిరీస్‌కు నాలుగో భాగం కూడా ఉండే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. మజవిల్ మనోరమ అవార్డ్స్ కార్యక్రమంలో నిర్మాత ఆంటోని పెరుంబవూర్ ‘దృశ్యం 4’ కచ్చితంగా ఉంటుందని చెప్పినట్లు ఓ వీడియోలో కనిపిస్తోంది. అయితే మోహన్‌లాల్, జీతూ జోసెఫ్ ఈ విషయంపై ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.
మే 21న విడుదలైన ‘దృశ్యం 3’లో మోహన్‌లాల్, మీనా మరోసారి జార్జ్‌కుట్టి, రాణి పాత్రల్లో కనిపించారు. ఈ భాగంలో కథను పూర్తిగా ముగించకుండా, తదుపరి భాగానికి అవకాశం ఉండేలా ముగించినట్లు తెలుస్తోంది. తమ కుమారుడి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్న సిద్ధిఖ్, ఆశా శరత్ పాత్రల కథ కూడా ఇంకా కొనసాగాల్సి ఉండటంతో ‘దృశ్యం 4’పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!