

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1,000 రోజులు పూర్తవుతున్న సందర్భంగా ఆ పార్టీ వైఫల్యాలు, హామీల అమలులో వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు విస్తృత కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో కేటీఆర్ పలు సూచనలు చేశారు. వివిధ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజలకు వివరించేలా కార్యక్రమాలను వినూత్నంగా నిర్వహించాలని సూచించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందని కేటీఆర్ ఆరోపించారు. 1,000 రోజులు పూర్తయినా ఇచ్చిన హామీల్లో ఒక్కదానినీ పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు, మాజీ ప్రజాప్రతినిధులు సహా అన్ని స్థాయిల నాయకులు కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాలు, వార్డుల స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని సూచించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!