

పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై అమెరికా ఫెడరల్ కోర్టులో నమోదైన క్రిమినల్ కేసు కొట్టివేయడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈ నిర్ణయంపై తనకు అనుమానాలు ఉన్నాయని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ భారత ప్రయోజనాలను ఫణంగా పెట్టారని ఆరోపిస్తూ, దీనికి దేశం భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు.
2024లో నమోదైన ఈ కేసులో సౌర విద్యుత్ కాంట్రాక్టులు దక్కించుకునేందుకు భారత అధికారులకు లంచాలు ఇవ్వడానికి అదానీ, ఆయన సహచరులు అంగీకరించారని, అమెరికా పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టించారని ఆరోపణలు వచ్చాయి. అయితే ఆ కేసును కొనసాగించకూడదని అమెరికా న్యాయశాఖ చేసిన అభ్యర్థనను ఆగస్టు 10న ఫెడరల్ న్యాయమూర్తి ఆమోదించారు. ఈ నిర్ణయ ప్రక్రియలోని కొన్ని అంశాలపై న్యాయమూర్తి ఆందోళన కూడా వ్యక్తం చేశారు. అదానీ, అదానీ గ్రూప్ ఆరోపణలను ఖండించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!