
జనరల్

యూపీఐ వాణిజ్య లావాదేవీలపై కొత్తగా అమలు చేయనున్న మర్చంట్ డిస్కౌంట్ రేట్ విధానానికి మధ్యంతర స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. రూ. 2,000కు పైబడిన కొన్ని యూపీఐ వ్యక్తి నుంచి వ్యాపారికి చేసే లావాదేవీలపై ఎండీఆర్ విధించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంలో సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసింది.
ఎండీఆర్ విధానానికి సంబంధించిన ఛార్జీల ప్రాతిపదిక, విధానం, అమలు తీరుపై సమగ్ర వివరాలు సమర్పించాలని కోర్టు కోరింది. కొత్త ఎండీఆర్ విధానం అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రావాల్సి ఉండగా, ప్రస్తుతానికి దానిపై సుప్రీంకోర్టు స్టే విధించలేదు. ఈ అంశంపై కేంద్రం, సంబంధిత సంస్థల స్పందనలను పరిశీలించిన అనంతరం కోర్టు తదుపరి విచారణ చేపట్టనుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!