
జనరల్

తెలంగాణలో వాతావరణ పరిస్థితులు మారడంతో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ ప్రాంతాల్లో అర్ధరాత్రి ఒంటి గంట వరకు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు అంచనా వేస్తున్నారు.
వర్షాలతో పాటు గంటకు సుమారు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా ఉండాలని, వాహనదారులు, ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!