

అక్కినేని నాగార్జున హోస్ట్‌గా ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 10’ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ సీజన్‌కు సంబంధించిన కొత్త ప్రోమోను నాగార్జున విడుదల చేశారు. గత సీజన్ల కంటే ఈసారి 10X సర్‌ప్రైజ్‌లు, 10X డ్రామా, 10X ఛాలెంజ్‌లు ఉంటాయని ప్రోమో ద్వారా హైప్ పెంచారు. “ఈసారి ఆటలో సవాల్ కాదు... ఆటే సవాల్” అంటూ నాగార్జున చెప్పిన డైలాగ్ కొత్త సీజన్‌లో గేమ్ మరింత ఆసక్తికరంగా ఉండబోతుందనే సంకేతాలను ఇచ్చింది. ఈ సీజన్‌కు ‘దశావతారం’ అనే థీమ్‌ను తీసుకొచ్చినట్లు ఇప్పటికే ప్రోమోల ద్వారా వెల్లడైంది.
నివేదికల ప్రకారం బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 సెప్టెంబర్ 6, 2026న ప్రారంభం కానుంది. ఈ షోను స్టార్ మాలో ప్రసారం చేయడంతో పాటు జియోహాట్‌స్టార్లో డిజిటల్‌గా స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం. అధికారిక కంటెస్టెంట్ల జాబితాను మేకర్స్ ఇంకా ప్రకటించలేదు. అయితే పల్లవి గౌడ, చంద్రహాస్, జ్యోతి, దీపికా రంగరాజు, తేజస్విని గౌడ తదితరుల పేర్లు సంభావ్య కంటెస్టెంట్లుగా వినిపిస్తున్నాయి. వీరి ఎంట్రీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!