
సినిమాలు

బజాజ్ ఫిన్‌సర్వ్ బోర్డు నుంచి రాజీవ్ బజాజ్ వైదొలగనున్నారు. బజాజ్ ఆటో విభాగంలో పెరుగుతున్న బాధ్యతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమర్పించిన ఫైలింగ్స్‌లో వెల్లడించింది.
ప్రస్తుతం బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్న రాజీవ్ బజాజ్, ఆటోమొబైల్ వ్యాపారంపై పూర్తిస్థాయిలో దృష్టి సారించేందుకు బజాజ్ గ్రూప్‌లోని ఇతర సంస్థల బాధ్యతలను క్రమంగా తగ్గించుకుంటున్నారు. అలాగే కొత్తగా ఏర్పాటైన వ్యాపారాల పర్యవేక్షణపై మరింత సమయం కేటాయించాల్సి ఉన్నందున జులై 31న జరగనున్న వార్షిక సర్వసభ్య సమావేశంలో తన పునర్నియామకాన్ని కోరబోనని బజాజ్ ఫిన్‌సర్వ్ వెల్లడించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!