

వినాయక చవితి పండుగను తెలుగు రాష్ట్రాల్లో అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. సంప్రదాయాల ప్రకారం ఇంట్లో ప్రతిష్ఠించే గణపతి విగ్రహం ఎడమవైపు తొండం కలిగిన వామముఖ గణపతిగా ఉండటం శ్రేయస్కరంగా భావిస్తారు. పండుగ రోజు ఇంటిని శుభ్రపరచి రంగవల్లికలు, మామిడి తోరణాలు, పూలతో అలంకరించి ప్రత్యేక మండపంలో గణపతిని ప్రతిష్ఠిస్తారు. శుభ ముహూర్తంలో ప్రాణ ప్రతిష్ఠ నిర్వహించి, అష్టోత్తర పూజలు, పత్రి పూజలు, మహా నైవేద్యాలతో గణనాథుడిని ఆరాధిస్తారు.
మోదకాలు, కుడుములు, ఉండ్రాళ్లు, పులిహోర, గారెలు, బూరెలు వంటి సంప్రదాయ వంటకాలను నైవేద్యంగా సమర్పించడం ప్రత్యేకత. పూజ అనంతరం వినాయక వ్రత కథ చదవడం, ఇతర ఇళ్లలో ప్రతిష్ఠించిన వినాయకులను దర్శించడం శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజున సాత్విక ఆహారం తీసుకోవడం, ఆధ్యాత్మిక నియమాలు పాటించడం ద్వారా గణపతి అనుగ్రహం లభించి ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖశాంతులు కలుగుతాయని భక్తుల విశ్వాసం.
గమనిక: పై వివరాలు మత విశ్వాసాలు, పురాణాలు, సంప్రదాయ గ్రంథాలు మరియు నిపుణుల అభిప్రాయాల ఆధారంగా అందించబడినవి. వీటికి ఆధునిక శాస్త్రీయ ఆధారాలు ఉండకపోవచ్చు. ఈ సమాచారాన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా పాఠకుల వ్యక్తిగత నిర్ణయం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!