

రష్యాలోని డీజిల్, ఇంధన మౌలిక వనరులపై ఉక్రెయిన్ నిర్వహిస్తున్న డ్రోన్ దాడులను వెంటనే ఆపాలని ఆ దేశ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీని కోరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం తెలిపారు. ఉక్రెయిన్ చేపడుతున్న దీర్ఘ శ్రేణి డ్రోన్ దాడుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా డీజిల్ కొరత మరింత తీవ్రతరమవుతోందని ట్రంప్ పేర్కొన్నారు. రష్యా డీజిల్ ఇంధన వనరులను లక్ష్యంగా చేసుకోకుండా ఇతర ప్రాంతాలపై దాడులు చేయాలని జెలెన్‌స్కీకి సూచించినట్లు వెల్లడించారు.
ప్రపంచంలోనే అతిపెద్ద చమురు, గ్యాస్ ఎగుమతిదారుల్లో ఒకటైన రష్యా ప్రస్తుతం ఇంధన సరఫరాపై ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఉక్రెయిన్ డ్రోన్ దాడుల ప్రభావంతో దేశంలో ఇంధన రేషనింగ్ అమలు చేస్తున్నట్లు సమాచారం. భారత్ నుంచి కూడా ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటున్నట్లు కథనాలు పేర్కొంటున్నాయి. మరోవైపు పశ్చిమాసియాలో కొనసాగుతున్న పరిణామాలతో ఇంధన సరఫరాకు ఇప్పటికే అంతరాయం ఏర్పడి, ధరలు పెరుగుతున్న సమయంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!