
జనరల్

వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్ బేగంబజార్‌లోని ఓ మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక గణపతి విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సాధారణ విగ్రహాలకు భిన్నంగా 24 క్యారెట్ల బంగారం, 3 లక్షల 880 అమెరికా వజ్రాలతో ఈ బంగారు గణపయ్యను తయారు చేయించినట్లు నిర్వాహకులు తెలిపారు. దీంతో విగ్రహం చూపరులను ఆకర్షించేలా మెరిసిపోతోంది.
బేగంబజార్ ఫీల్‌ఖానా ప్రాంతానికి చెందిన అనిల్ అగర్వాల్, ఆధార్ అగర్వాల్, నిఖితేష్ అగర్వాల్ అనే అన్నదమ్ములు ఈ విగ్రహాన్ని తయారు చేయించారు. తమ దుకాణం వద్ద ఏర్పాటు చేసిన మండపంలో గణపతిని ప్రతిష్ఠించారు. మూడు అడుగుల ఎత్తు, 48 కిలోల బరువున్న ఈ విగ్రహాన్ని ఎనిమిది మంది కళాకారులు అత్యంత సుందరంగా రూపొందించారు. ఈ గణనాథుడికి 11 రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!