
జనరల్

వినాయక చవితి సందర్భంగా సిరిసిల్లలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వెండి వినాయకుడు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. సిరిసిల్లలోని రామలాల్ మండపం నిర్వాహకులు 2,016 వెండితో తయారు చేసిన గణేశుడి ప్రతిమల సమాహారంతో 11 అడుగుల ఎత్తైన వినాయకుడి విగ్రహాన్ని రూపొందించి ప్రతిష్ఠించారు. ప్రత్యేక ఆకృతిలో ఉన్న ఈ వెండి గణపయ్య మండపానికి ప్రధాన ఆకర్షణగా నిలిచారు.
ఈ ప్రత్యేక సిల్వర్ గణపతిని నాందేడ్‌కు చెందిన కళాకారులు రూపొందించారు. రామలాల్ మండపం నిర్వాహకులు ప్రతి ఏడాది విభిన్న ఆలోచనలతో గణపతి విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. గతేడాది పర్యావరణ సమతుల్యతకు ప్రాధాన్యం ఇస్తూ 10,116 స్పటిక లింగాలను ఉపయోగించి మట్టితో వినాయకుడి విగ్రహాన్ని రూపొందించారు. ఈ ఏడాది వెండి గణపతితో భక్తులను ఆకట్టుకుంటున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!