

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) జూన్ నెలలో శ్రీవారి లడ్డూ ప్రసాదాల విక్రయాల్లో రికార్డు నెలకొల్పింది. భక్తుల రద్దీ భారీగా పెరగడంతో ఈ ఏడాది జూన్‌లో మొత్తం 1,26,81,805 లడ్డూలు విక్రయమైనట్లు టీటీడీ వెల్లడించింది. ఏప్రిల్‌లో 1,11,96,170, మేలో 1,21,35,528 లడ్డూలు విక్రయమవగా, జూన్‌లో అత్యధిక విక్రయాలు నమోదయ్యాయి. భక్తులకు ఎలాంటి కొరత లేకుండా లడ్డూ ఉత్పత్తిని పెంచి ప్రసాదాలను అందించినట్లు టీటీడీ తెలిపింది.
గత ఏడాది జూన్‌లో 1,19,21,353 లడ్డూలు విక్రయమవగా, ఈ ఏడాది అదే నెలలో 7,59,452 లడ్డూలు అదనంగా విక్రయమై 6.37 శాతం వృద్ధి నమోదైంది. అలాగే 2024 జూన్‌తో పోలిస్తే 24,17,441 లడ్డూలు అధికంగా విక్రయమై 23.55 శాతం వృద్ధి నమోదైంది. తిరుమలకు విచ్చేస్తున్న భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో లడ్డూ తయారీ, పంపిణీలో సమర్థవంతమైన ప్రణాళికతో సేవలు అందిస్తున్నట్లు టీటీడీ పేర్కొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!