

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ తీవ్ర విమర్శలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి అత్యంత ప్రమాదకారిగా మారారని ఆరోపించారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. విదేశీ పర్యటనకు వెళ్లే ముందు నిబంధనల ప్రకారం అవసరమైన క్లియరెన్స్‌లు తీసుకోవాలన్న కనీస అవగాహన ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి లండన్ పర్యటనపై కూడా అర్వింద్ పలు ప్రశ్నలు లేవనెత్తారు. అక్బరుద్దీన్ ఓవైసీ కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకే ఆయన లండన్ వెళ్తున్నారనే సమాచారం ఉందని, ఆ కార్యక్రమాన్ని అధికారిక టూర్ ప్రోగ్రామ్‌లో ఎందుకు చేర్చలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు కార్యక్రమాలకు సొంత డబ్బులతో వెళ్లవచ్చని, ప్రజాధనాన్ని ఉపయోగించకూడదని వ్యాఖ్యానించారు. కేసీఆర్ హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్న విధంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా వ్యవహరిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యతిరేకత ఉందని, ఆ పార్టీకి చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్యే విభేదాలు ఉన్నాయని అర్వింద్ ఆరోపించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!