

బియ్యం ధరలు సామాన్యులకు భారంగా మారుతున్నాయి. గత రెండు నెలల్లో వివిధ రకాల బియ్యం ధరలు కిలోకు రూ.10 నుంచి రూ.12 వరకు పెరిగాయి. బీపీటీ బియ్యం ధర కిలో రూ.55 నుంచి రూ.65కు చేరగా, సోనా మసూరి ధర రూ.60 నుంచి రూ.70కి పెరిగింది. 25 కిలోల బస్తాపై రకాన్ని బట్టి రూ.200 నుంచి రూ.300 వరకు ధర పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. దీంతో పేద, మధ్యతరగతి కుటుంబాల నెలవారీ బడ్జెట్‌పై ప్రభావం పడుతోంది.
గతేడాది వరి దిగుబడులు అధికంగా వచ్చినప్పటికీ, ప్రస్తుతం మార్కెట్‌లో డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడం ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. విదేశీ ఎగుమతులు, ఇతర రాష్ట్రాలకు బియ్యం తరలింపు, ఇథనాల్ తయారీకి తక్కువ రకం బియ్యం వినియోగం వంటి అంశాలు కూడా ప్రభావం చూపుతున్నాయి. కొందరు వ్యాపారులు నిల్వలు పెంచి ధరలు పెంచుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. అక్రమ నిల్వలపై అధికారులు చర్యలు తీసుకుంటే ధరలు నియంత్రణలోకి వస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!