

భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఈ నెల 13న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. మ్యాచ్ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీమిండియా ఆటగాళ్లు ఇప్పటికే ఢిల్లీ చేరుకుని మైదానంలో సాధన ప్రారంభించారు. అయితే, తాజా భద్రతా సమీక్షల నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
ఈ నెల 13న దేశ రాజధానిలో బ్రిక్స్ సదస్సు జరగనుండటమే మ్యాచ్ వాయిదాకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. సదస్సుకు పలు దేశాల అగ్రనేతలు హాజరుకానుండటంతో ఢిల్లీలో భారీ భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ ఆంక్షలు, వీఐపీ కదలికలు ఉండనున్నాయి. దీంతో అదే రోజు వేలాది మంది అభిమానుల సమక్షంలో అంతర్జాతీయ మ్యాచ్ నిర్వహించడం భద్రతా విభాగాలకు సవాలుగా మారనుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ను మరో తేదీకి మార్చే అంశంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి, ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు చర్చిస్తున్నట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!