
ఓటీటీ

ఉక్రెయిన్‌తో కొనసాగుతున్న యుద్ధంలో రష్యా సైన్యం కీలక డాన్‌బాస్ ప్రాంతం వైపు పురోగమిస్తోంది. కోస్టియాంటినివ్కా నగరంలోకి రష్యా బలగాలు ప్రవేశించినట్లు ఉక్రెయిన్ సైనికులు తెలిపారు. నగరంపై ప్రస్తుతం పట్టు ఉన్నప్పటికీ అది దీర్ఘకాలం నిలవకపోవచ్చని వారు అంచనా వేస్తున్నారు. నగరాన్ని పూర్తిగా చుట్టుముట్టేందుకు రష్యా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
ఇదే సమయంలో ఇరు దేశాలు భారీ స్థాయిలో డ్రోన్ దాడులు నిర్వహిస్తున్నాయి. సుమి నగరంపై రష్యా డ్రోన్ దాడిలో ఒక కుటుంబం ముగ్గురు మృతి చెందారు. 88 డ్రోన్లు, ఒక బాలిస్టిక్ క్షిపణిని రష్యా ప్రయోగించగా, వాటిలో ఎక్కువ భాగాన్ని ఉక్రెయిన్ అడ్డుకుంది. మరోవైపు ఉక్రెయిన్ కూడా రష్యా చమురు కేంద్రాలు, మౌలిక సదుపాయాలపై దాడులు చేసింది. మాస్కోలో విమానాశ్రయాలు తాత్కాలికంగా మూసివేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!