

రష్యా-ఉక్రెయిన్ మధ్య పరస్పర దాడులు తీవ్రరూపం దాలుస్తున్నాయి. సోమవారం దక్షిణ ఉక్రెయిన్‌లోని ఓ సహాయ శిబిరంపై రష్యా సేనలు వైమానిక దాడులకు పాల్పడ్డాయి. ఈ ఘటనలో 24 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది వరకు గల్లంతైనట్లు సమాచారం. శిథిలాల కింద చిక్కుకున్నవారి కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు.
కొమిషువాఖా నివాస ప్రాంతంలోని ఓ పాఠశాలను తాత్కాలిక సహాయ కేంద్రంగా వినియోగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. సోమవారం ఆ పాఠశాల భవనంతో పాటు సమీపంలోని మరో సహాయ కేంద్రంపైనా దాడులు జరిగినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ పేర్కొన్నారు. సాధారణ పౌరులు ఆశ్రయం పొందుతున్న భవనాలనూ రష్యా లక్ష్యంగా చేసుకుంటోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్రిక్తతలను తగ్గించడం లేదా యుద్ధాన్ని ముగించడం రష్యా లక్ష్యంగా పెట్టుకోలేదని ఈ దాడులు మరోసారి నిరూపిస్తున్నాయని వ్యాఖ్యానించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!