

షారుఖ్ ఖాన్ తన తదుపరి చిత్రం కింగ్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. వార్, పఠాన్ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న సిద్ధార్థ్ ఆనంద్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంతో షారుఖ్ కుమార్తె సుహానా ఖాన్ వెండితెరకు పరిచయం కానుండటం మరో ప్రత్యేకత. షారుఖ్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం తూ మిల్ జాయే అనే పాటను విడుదల చేయగా, దానికి మంచి స్పందన వస్తున్నట్లు సమాచారం. తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం, ఈ సినిమా కోసం ప్రత్యేకంగా టీజర్‌ను విడుదల చేయకుండా, విడుదలకు దగ్గరగా నేరుగా ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారట.
ట్రైలర్ విడుదలకు ముందు మరో ఒకటి లేదా రెండు పాటలను విడుదల చేసే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొణె, అభిషేక్ బచ్చన్, రాణి ముఖర్జీ, అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్, జైదీప్ అహ్లావత్, అర్షద్ వార్సీ, రాఘవ్ జుయల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ తారాగణం, సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. కింగ్ చిత్రం 2026 డిసెంబర్ 24న థియేటర్లలో విడుదల కానుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!