
జనరల్

సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) హోంగార్డ్ వెంకటరాజును అరెస్ట్ చేసింది. సాయి కృష్ణను కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన సమయంలో అక్కడి సీసీటీవీ ఫుటేజ్‌ను తొలగించడంతో పాటు డీవీఆర్‌ను ధ్వంసం చేసినట్లు వెంకటరాజుపై ఆరోపణలు ఉన్నాయి. కేసులో సాక్ష్యాల ధ్వంసానికి సంబంధించిన అంశాలపై సిట్ దర్యాప్తు కొనసాగిస్తోంది.
అరెస్ట్ అనంతరం సిట్ అధికారులు హోంగార్డ్ వెంకటరాజును వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు పూర్తైన తర్వాత ఆయనను కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. సాయి కృష్ణ కస్టడీ మరణానికి సంబంధించిన పరిస్థితులతో పాటు సీసీటీవీ ఫుటేజ్, డీవీఆర్ ధ్వంసం వెనుక ఉన్న కారణాలపై సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!