

రైడ్ హేలింగ్ సంస్థ రాపిడో హైదరాబాద్ ఫుడ్ డెలివరీ మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. ‘ఓన్లీ’ పేరుతో ఫుడ్ డెలివరీ సేవలను నగరంలో ప్రారంభించింది. బెంగళూరు తర్వాత ఓన్లీ సేవలు అందుబాటులోకి వచ్చిన రెండో నగరం హైదరాబాద్. బెంగళూరులో ప్రారంభమైన సేవకు లభించిన స్పందన నేపథ్యంలో హైదరాబాద్‌లోనూ విస్తరించినట్లు సంస్థ వెల్లడించింది.
ఓన్లీ ప్రధాన ప్రత్యేకత జీరో కమిషన్ మోడల్. భాగస్వామ్య రెస్టారెంట్ల నుంచి ప్రతి ఆర్డర్‌పై కమిషన్ వసూలు చేయకుండా సేవలను అందిస్తున్నట్లు రాపిడో తెలిపింది. డెలివరీలను రాపిడో కెప్టెన్ నెట్‌వర్క్ నిర్వహించనుంది. దీంతో రైడ్ సేవలతో పాటు ఫుడ్ డెలివరీ ఆర్డర్ల ద్వారా కూడా కెప్టెన్లకు అదనపు ఆదాయ అవకాశాలు లభించనున్నాయి. హైదరాబాద్ లాంచ్ సందర్భంగా రాపిడో కెప్టెన్ల కోసం నిర్వహించిన బిర్యానీ కార్యక్రమంలో టాలీవుడ్ నటుడు నాని పాల్గొని వారితో ముచ్చటించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!