

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’ ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా మీడియాతో మాట్లాడిన ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ ‘ది ప్యారడైజ్’లో నాని పాత్ర చాలా కొత్తగా ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా రెండు జడలతో నాని కనిపించడం భారతీయ తెరపై ఇప్పటివరకు చూడని విధంగా ఉంటుందని చెప్పారు.
ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు అత్యంత భారీ స్థాయిలో ఉంటాయని రామ్-లక్ష్మణ్ తెలిపారు. రెండు జడలతో యాక్షన్ చేయడం చాలా కష్టమని, పోరాట సన్నివేశాల్లో అవి ముఖానికి, రూప్‌లకు తగులుతూ ఇబ్బందులు కలిగించేవని వివరించారు. అయినప్పటికీ నాని ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ప్రతి సన్నివేశానికి తన వంద శాతం కష్టపడ్డారని ప్రశంసించారు. ఎన్ని టేక్‌లు అయినా చేయడానికి సిద్ధంగా ఉండేవారని, శ్రీకాంత్ ఓదెల విజన్‌కు నాని పూర్తి న్యాయం చేశారని అన్నారు. ఈ సినిమాలో భాగమవడం తమ అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!