

నేషనల్ అవార్డు విజేత కీర్తి సురేష్, సనంత్, రిషికాంత్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘డోరతీ’. ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రానికి ఇళయరాజా నేపథ్య సంగీతం అందించారు. ఆయన కెరీర్‌లో ఇది 1540వ సినిమా కావడం విశేషం. జియో స్టూడియోస్, సిఖ్యా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై నిర్మించిన ఈ చిత్రం ఈ నెల థియేటర్లలో విడుదల కానుంది. విడుదలకు ముందే ‘డోరతీ’ అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. కెనడాలో జరుగుతున్న ప్రతిష్టాత్మక టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోని సెంటర్‌పీస్ విభాగంలో ఈ సినిమా ప్రపంచ ప్రీమియర్ ప్రదర్శన జరిగింది.
స్కాటియాబ్యాంక్ థియేటర్‌లో జరిగిన ఈ ప్రీమియర్‌కు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్‌తో పాటు కీర్తి సురేష్, సనంత్, రిషికాంత్, నిర్మాతలు గునీత్ మోంగా కపూర్, అచిన్ జైన్ హాజరయ్యారు. గత దశాబ్ద కాలంలో టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమైన తొలి తమిళ చిత్రంగా ‘డోరతీ’ నిలిచినట్లు చిత్రబృందం తెలిపింది. ఈ సందర్భంగా కార్తీక్ సుబ్బరాజ్ మాట్లాడుతూ స్నేహం, ప్రేమ, కులం, పురుషత్వం, కరుణ వంటి సున్నితమైన అంశాలను కథలో లోతుగా చూపించామని, ప్రపంచ స్థాయి వేదికపై సినిమా ప్రయాణం ప్రారంభం కావడం గర్వంగా ఉందని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!