13, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 6: తొలి వీకెండ్‌లో ఊహించని ట్విస్టులు...హౌస్‌లో పెరిగిన ఎలిమినేషన్‌ టెన్షన్‌

Writer: Pooja 12:17 AM, 13 సెప్టెంబర్, 2026
బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 6: తొలి వీకెండ్‌లో ఊహించని ట్విస్టులు...హౌస్‌లో పెరిగిన ఎలిమినేషన్‌ టెన్షన్‌

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 10 తొలి వీకెండ్‌ ఎపిసోడ్‌ శనివారం సందడిగా సాగింది. హోస్ట్‌ నాగార్జున స్టైలిష్‌గా ఎంట్రీ ఇచ్చి కంటెస్టెంట్ల ఆటతీరును సమీక్షించారు. తప్పులు చేసిన వారిని ప్రశ్నిస్తూనే బాగా ఆడిన వారిని అభినందించారు. తనదైన పంచ్‌లు, సరదా సంభాషణలతో హౌస్‌లో నవ్వులు పూయించారు. మొదట కాస్త సీరియస్‌గా కనిపించడంతో హౌస్‌మేట్స్‌ భయపడగా, ఆ తర్వాత నవ్వుతూ వారితో సరదాగా మాట్లాడారు.

రాంప్రసాద్‌, నరేశ్‌ కలిసి హౌస్‌లో కంటెస్టెంట్ల ఆటతీరుపై ఇచ్చిన సరదా రివ్యూలను నాగార్జున వీక్షించి ఇద్దరినీ అభినందించారు. అయితే రాంప్రసాద్‌తో పోలిస్తే నరేశ్‌ తన అభిప్రాయాలను మరింత హార్ట్‌ఫుల్‌గా చెప్పాడని పేర్కొన్నారు. అనంతరం అగ్నిపరీక్ష తర్వాత అసలైన మహాపరీక్ష మొదలైందని గుర్తుచేశారు. హౌస్‌లోకి అడుగుపెట్టిన 16 మంది కంటెస్టెంట్లలో కొందరు ఇప్పటికే హౌస్‌మేట్స్‌గా మారగా, మరికొందరు ఎలిమినేట్‌ అయ్యారని తెలిపారు. ప్రస్తుతం 11 మంది కంటెస్టెంట్లు రిస్క్‌లో ఉన్నారని చెప్పారు.

చరణ్‌, చైత్రలు ఇంకా సీక్రెట్‌ రూమ్‌లో ఉన్నారా అనే అనుమానాలపై నాగార్జున వారితో మాట్లాడించారు. చరణ్‌ షాలినీతో మాట్లాడి ఆమె బాగా ఆడుతోందని, అదే విధంగా కొనసాగాలని ధైర్యం చెప్పాడు. చైత్ర ముకేశ్‌తో మాట్లాడి అతడు చెప్పిన మాట విని ఉంటే బాగుండేదని చెప్పింది. మరోవైపు రోహిత్‌, రాంప్రసాద్‌, టెంపర్‌ వంశీ బాగా ఆడుతున్నారని ప్రశంసిస్తూ వారికి మిల్క్‌షేక్‌లు పంపించారు. వారు తాగిన గ్లాసులను నాగార్జున స్వయంగా కడిగి, ఏ పని చిన్నది కాదని, ఏ పని తక్కువది కాదని సూచించారు.

ముకేశ్‌, త్రిగుణ్‌, వర్షిణిలలో ఒకరు ప్రేక్షకుల ఓటింగ్‌ ఆధారంగా హౌస్‌మేట్‌గా మారనుండగా, చివరకు నాలుగో హౌస్‌మేట్‌గా త్రిగుణ్‌ ఎంపికయ్యాడు. రోహిత్‌, త్రిగుణ్‌ ప్రవర్తనపై నాగార్జున అసహనం వ్యక్తం చేసి, త్రిగుణ్‌తో రోహిత్‌కు క్షమాపణ చెప్పించారు. అనంతరం అతడికి పనిష్‌మెంట్‌ విధించారు. తెలుగులో మాట్లాడుతున్న బేబ్‌జానీని ప్రత్యేకంగా అభినందించిన నాగార్జున, రాంప్రసాద్‌ తన మాటతీరును నియంత్రించుకోవాలని సూచించారు. షాలినీకి సారీ చెప్పేందుకు రాంప్రసాద్‌తో 500 సార్లు “సారీ” రాయించారు. చివర్లో లాస్ట్‌ హౌస్‌మేట్‌గా దేబ్జానీ ఎంపికైనట్లు ప్రకటించడంతో బిగ్‌బాస్‌ హౌస్‌లో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమో 2: రోహిత్‌కు నాగార్జున క్లాస్...త్రిగుణ్‌కు సాఫ్ట్ ట్రీట్‌మెంట్

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమో 2: రోహిత్‌కు నాగార్జున క్లాస్...త్రిగుణ్‌కు సాఫ్ట్ ట్రీట్‌మెంట్

బిగ్‌బాస్ 10 కృష్ణుడి జర్నీకి బ్రేక్ పడిందా?

బిగ్‌బాస్ 10 కృష్ణుడి జర్నీకి బ్రేక్ పడిందా?

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమో 1: హౌస్‌మేట్స్‌కు నాగార్జున స్ట్రాంగ్‌ వార్నింగ్‌

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమో 1: హౌస్‌మేట్స్‌కు నాగార్జున స్ట్రాంగ్‌ వార్నింగ్‌

బిగ్‌బాస్‌లో మేరీకోమ్‌ తీరుపై విమర్శలు

బిగ్‌బాస్‌లో మేరీకోమ్‌ తీరుపై విమర్శలు

బిగ్ బాస్ తెలుగు 10లోకి కావ్యశ్రీ?

బిగ్ బాస్ తెలుగు 10లోకి కావ్యశ్రీ?

బిగ్ బాస్ తెలుగు 10: నందనకు ఇంత రెమ్యునరేషనా?

బిగ్ బాస్ తెలుగు 10: నందనకు ఇంత రెమ్యునరేషనా?

ట్యాగ్లు
బిగ్‌బాస్‌ తెలుగు 10బిగ్‌బాస్‌ తెలుగునాగార్జునవీకెండ్‌ ఎపిసోడ్‌తెలుగు టెలివిజన్‌రియాలిటీ షో
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 6: తొలి వీకెండ్‌లో ఊహించని ట్విస్టులు...హౌస్‌లో పెరిగిన ఎలిమినేషన్‌ టెన్షన్‌
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 6: తొలి వీకెండ్‌లో ఊహించని ట్విస్టులు...హౌస్‌లో పెరిగిన ఎలిమినేషన్‌ టెన్షన్‌

తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు
జనరల్

తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు

‘ది ప్యారడైజ్’లో నాని యాక్షన్‌పై రామ్ లక్ష్మణ్ ప్రశంసలు
సినిమాలు

‘ది ప్యారడైజ్’లో నాని యాక్షన్‌పై రామ్ లక్ష్మణ్ ప్రశంసలు

సిల్వర్‌స్టోన్‌లో సీఎం విజయ్-అజిత్ ప్రత్యేక భేటీ
జనరల్

సిల్వర్‌స్టోన్‌లో సీఎం విజయ్-అజిత్ ప్రత్యేక భేటీ

చైనా భారత్ భాగస్వామ్యంపై జిన్‌పింగ్ మోదీ కీలక చర్చ
జనరల్

చైనా భారత్ భాగస్వామ్యంపై జిన్‌పింగ్ మోదీ కీలక చర్చ

బాలీవుడ్‌లో మరో జంటపై విడాకుల రూమర్స్ వైరల్
గాసిప్స్

బాలీవుడ్‌లో మరో జంటపై విడాకుల రూమర్స్ వైరల్

రాజీనామా చేయాల్సింది ఎవరు? - మంత్రి పొంగులేటి
రాజకీయాలు

రాజీనామా చేయాల్సింది ఎవరు? - మంత్రి పొంగులేటి

బ్రిక్స్ సదస్సులో స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన ఇండియా పోస్ట్
జనరల్

బ్రిక్స్ సదస్సులో స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన ఇండియా పోస్ట్

హైదరాబాద్ వినాయక భక్తులకు టీజీఎస్‌ ఆర్టీసీ శుభవార్త
జనరల్

హైదరాబాద్ వినాయక భక్తులకు టీజీఎస్‌ ఆర్టీసీ శుభవార్త

నిమ్స్ వైద్యులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

నిమ్స్ వైద్యులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి

విడుదలకు ముందే ‘డోరతీ’కి అరుదైన గౌరవం
సినిమాలు

విడుదలకు ముందే ‘డోరతీ’కి అరుదైన గౌరవం

సెన్సార్ అభ్యంతరాలతో ‘సీక్రెట్ సోల్జర్’కు కొత్త టైటిల్
సినిమాలు

సెన్సార్ అభ్యంతరాలతో ‘సీక్రెట్ సోల్జర్’కు కొత్త టైటిల్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!