

సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జీవో నం.118 కింద ఇళ్ల క్రమబద్ధీకరణ ధ్రువపత్రాల జారీ కార్యక్రమంలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, కాంగ్రెస్ నేత మధుయాష్కీ వర్గాలు పరస్పరం నినాదాలు చేసుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరగడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. జీవో 118 కింద క్రమబద్ధీకరణ ప్రక్రియ సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమవుతుందని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ధ్రువపత్రాల పంపిణీ కార్యక్రమానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, అజహరుద్దీన్ హాజరయ్యారు. ఎల్బీనగర్ పరిధిలో జీవో 118 కింద పెండింగ్‌లో ఉన్న క్రమబద్ధీకరణ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో 9,792 ప్లాట్ల క్రమబద్ధీకరణకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేయనున్నట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!