
సినిమాలు

కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘హనుమాన్ అంష్’ బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లు సాధిస్తోంది. విడుదలై ఏడు వారాలు పూర్తయినా ఈ సినిమా జోరు కొనసాగుతోంది. సెప్టెంబర్ 18న 43వ రోజున రూ.5 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం.. భారత్‌లో ఇప్పటివరకు రూ.248.38 కోట్ల నెట్, రూ.293.30 కోట్ల గ్రాస్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.316.30 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించిన ఈ ఆధ్యాత్మిక డ్రామాలో శోభినవ్ సత్య, చందన్ ఆనంద్ ప్రధాన పాత్రలు పోషించారు. స్వాతంత్ర్యానికి పూర్వం తన తల్లి మరణం తర్వాత భగవంతుడి అన్వేషణలో ఉత్తర భారతదేశమంతా పర్యటించే లక్ష్మీ నారాయణ్ జీవిత ప్రయాణం చుట్టూ కథ సాగుతుంది. ఈ ప్రయాణంలోనే ఆయన అనంతరం నీమ్ కరోలి బాబాగా మారినట్లు సినిమా చూపిస్తుంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!