

నాని కథానాయకుడిగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’పై దర్శకుడు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సెప్టెంబర్ 24న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ట్రైలర్ విడుదల చేయకుండా నేరుగా సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. ‘‘ట్రైలర్‌ను హడావిడిగా కట్ చేసి విడుదల చేయడానికి సమయం లేదు. నాకు నచ్చని పని చేయను. సినిమా నేరుగా థియేటర్లలోనే మాట్లాడాలన్నది నా అభిప్రాయం’’ అని తెలిపారు. ఈ సినిమా రెండు భాగాలుగా ఉంటుందని, సీక్వెల్స్ మాత్రం ఉండవని, ‘‘ఇది ఒకే ఒక్క బుల్లెట్’’ అని పేర్కొన్నారు. 171 రోజుల పాటు చిత్రీకరణ సాగిందని, ఇందులో నాలుగు భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నప్పటికీ ప్రేక్షకులు థియేటర్ల నుంచి స్వచ్ఛమైన భావోద్వేగాన్ని వెంట తీసుకెళ్తారని అన్నారు.
నాని ఈ సినిమా కోసం తన 18 ఏళ్ల కెరీర్‌లోనే అత్యంత కఠినమైన కష్టం చేశారని శ్రీకాంత్ ఓదెల చెప్పారు. నాని పాత్రకు రెండు జడల లుక్ తన చిన్ననాటి జ్ఞాపకాల నుంచి స్ఫూర్తి పొందిందని, ఆ లుక్‌ను నాని మాత్రమే నమ్మి అంగీకరించారని తెలిపారు. మోహన్‌బాబు ప్రధాన ప్రతినాయకుడిగా కనిపిస్తారని, ఆయనతో నాని ఫేస్‌ఆఫ్ థియేటర్లలో ప్రత్యేక అనుభూతిని ఇస్తుందని చెప్పారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ చిత్రంలో ఆరు పాటలు ఉంటాయని, ఆదిలాబాద్‌లోని వాస్తవ ఘటనలు, సికింద్రాబాద్ బస్తీ జీవనశైలిని కలిపి కథను రూపొందించినట్లు వివరించారు. ‘సవారి’ అనే కొత్త సంస్కృతిని సినిమాలో చూపించినట్లు పేర్కొన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!