

భారత స్టార్ షట్లర్ హెచ్.ఎస్. ప్రణయ్ ఆసియా క్రీడలపై కీలక వ్యాఖ్యలు చేశాడు. జపాన్‌లోని ఐచి-నగోయాలో జరుగుతున్న 2026 ఆసియా క్రీడలు తనకు బహుశా చివరివి కావచ్చని తెలిపాడు. మరో నాలుగేళ్ల తర్వాత ఇదే స్థాయిలో ఆడగలనో లేదో తెలియదని పేర్కొన్నాడు. ప్రస్తుతం శారీరకంగా, మానసికంగా మంచి స్థితిలో ఉన్నానని, ఇటీవల వియత్నాం ఓపెన్‌లోనూ కొంతకాలం తర్వాత మంచి ప్రదర్శన చేశానని చెప్పాడు. గత ఆసియా క్రీడల్లో భారత పురుషుల జట్టు స్వర్ణాన్ని తృటిలో చేజార్చుకున్న నేపథ్యంలో.. ఈసారి ఫైనల్‌కు చేరి బంగారు పతకం సాధించడమే లక్ష్యమని ప్రణయ్ తెలిపాడు.
అయితే 2028 లాస్‌ఏంజెలెస్ ఒలింపిక్స్ లక్ష్యాన్ని మాత్రం ప్రణయ్ వదులుకోలేదు. వచ్చే ఏడాదిన్నర పాటు తన ఆటను కొనసాగిస్తూ.. ఒలింపిక్స్‌కు అర్హత సాధించే వాస్తవిక అవకాశం ఉందని భావిస్తే ముందుకు సాగుతానని, లేకపోతే ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటానని చెప్పాడు. కిదాంబి శ్రీకాంత్ పట్టుదల తనకు స్ఫూర్తినిస్తోందని పేర్కొన్నాడు. మరోవైపు డబుల్స్ స్టార్ చిరాగ్ శెట్టి గత ఆసియా క్రీడల్లో సాధించిన రజతాన్ని ఈసారి స్వర్ణంగా మార్చేందుకు భారత జట్టు పూర్తిస్థాయిలో ప్రయత్నిస్తుందని తెలిపాడు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!