

సౌదీ అరేబియాలోని పలు విమానాశ్రయాలపై హౌతీ దాడుల నేపథ్యంలో ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. రియాద్, దమ్మామ్, జెడ్డా నగరాలకు నడిపే విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసింది. ఈ నెల 17వ తేదీ వరకు రియాద్‌కు వెళ్లే, అక్కడి నుంచి వచ్చే విమానాలు రద్దు చేసినట్లు సమాచారం. భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విమాన సర్వీసుల రద్దుతో ప్రయాణ ప్రణాళికలు మార్చుకోవాల్సిన పరిస్థితి ప్రయాణికులకు ఎదురైంది.
రద్దైన విమానాల్లో ప్రయాణించాల్సిన వారికి పూర్తి రీఫండ్ అందించనున్నట్లు ఎయిరిండియా తెలిపింది. సౌదీ అరేబియాలోని విమానాశ్రయాల వద్ద భద్రతా పరిస్థితులపై ఆందోళనల నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం. ప్రయాణికులు తమ విమానాల తాజా స్థితిని అధికారిక ఎయిరిండియా వెబ్‌సైట్ లేదా సంబంధిత కస్టమర్ సేవల ద్వారా తెలుసుకోవాలని సూచించారు. విమానాల పునరుద్ధరణకు సంబంధించిన తాజా సమాచారం కోసం సంస్థ అధికారిక ప్రకటనలను పరిశీలించడం మంచిది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!