

హైదరాబాద్‌లోని అత్తాపూర్ ఉప్పర్‌పల్లిలో ఉన్న బార్బీక్యూ నేషన్ రెస్టారెంట్‌పై ఫుడ్ పాయిజనింగ్ ఫిర్యాదుల నేపథ్యంలో హెచ్-ఫాస్ట్ మరియు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇటీవల ఈ రెస్టారెంట్‌లో భోజనం చేసిన ఇద్దరు అస్వస్థతకు గురవడంతో అధికారులు దర్యాప్తు చేపట్టారు.
తనిఖీల్లో కుళ్లిన మాంసం, అపరిశుభ్రంగా నిల్వ చేసిన చికెన్, మటన్, చేపలు, కేకులు, ఐస్‌క్రీమ్ తదితర ఆహార పదార్థాలు గుర్తించారు. పాత మాంసానికి కొత్త తేదీలతో లేబుళ్లు అతికించినట్లు కూడా అధికారులు గుర్తించారు. అన్ని ఆహార నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పరీక్షల కోసం పంపించారు.
ఫుడ్ ఇన్‌స్పెక్టర్ సౌమ్యారెడ్డి మాట్లాడుతూ నివేదిక ఆధారంగా రంగారెడ్డి జిల్లా అధికారులకు వివరాలు పంపించి భారీ జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అత్తాపూర్, రాజేంద్రనగర్ ప్రాంతాల్లోని ఇతర హోటళ్లు, రెస్టారెంట్లలో కూడా ఇలాంటి తనిఖీలు నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!