
రాజకీయాలు

నీట్ పరీక్షలో జరిగినట్లు ఆరోపిస్తున్న అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ జంతర్ మంతర్ వద్ద చేపట్టిన ఆందోళనకు పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ సంఘీభావం తెలిపారు. జూన్ 20 నుంచి కొనసాగుతున్న ఈ నిరసన విద్యా వ్యవస్థలో పారదర్శకత కోసం చేపట్టిన ఉద్యమమని నిర్వాహకులు పేర్కొన్నారు.
ఆదివారం సోనమ్ వాంగ్‌చుక్‌తో పాటు వందలాది మంది విద్యార్థులు, ఉద్యమకారులు, రైతు సంఘాల నాయకులు ఆందోళనలో పాల్గొన్నారు. రెండు నిమిషాల మౌనం పాటించిన అనంతరం నిరాహార దీక్ష ప్రారంభించారు. దీక్షకు ముందు వాంగ్‌చుక్, సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేతో కలిసి రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. కొందరు రైతు నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేశారని నిర్వాహకులు ఆరోపించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!