12, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గోదావరి జలాలను గ‌రిష్ట స్థాయిలో వినియోగించుకోవాలి- సీఎం రేవంత్ రెడ్డి

Writer: Chandrika 11:00 PM, 12 ఆగస్టు, 2026
గోదావరి జలాలను గ‌రిష్ట స్థాయిలో వినియోగించుకోవాలి- సీఎం రేవంత్ రెడ్డి

గోదావరి జలాలను గరిష్ట స్థాయిలో వినియోగించుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎల్లంపల్లితో పాటు దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల నుంచి సాధ్యమైనంత మేర ఎత్తిపోతలు చేపట్టాలని సూచించారు. హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో నీటిపారుదల శాఖపై మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సీఎం సమీక్ష నిర్వహించారు. దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల ఎత్తిపోతలకు సంబంధించి చిన్నపాటి సాంకేతిక సమస్యలు ఉంటే వాటిని వెంటనే పరిష్కరించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం సూచించారు.

దేవాదుల నుంచి గతంలో ఎన్నడూ లేని విధంగా తొమ్మిది పంపులతో ఎత్తిపోతలు చేపట్టామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్ఏ) సూచనల మేరకే నీటిని నిల్వ చేయడం లేదని సీఎం పేర్కొన్నారు. మేడిగడ్డతో పాటు సుందిళ్ల బ్యారేజీలోనూ లోపాలు ఉన్నట్లు తేలిందని మంత్రి వివరించగా, ఈ అంశంపై ఎన్‌డీఎస్ఏతో సంప్రదింపులు జరపాలని సీఎం ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న పరిహారాన్ని వెంటనే చెల్లించేందుకు కార్యాచరణ రూపొందించాలని, నీటిపారుదల, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ముంపు గ్రామాలు, పరిహారం, పునరావాసంపై వాస్తవ నివేదికలు సిద్ధం చేయాలని సూచించారు. తక్షణ ప్రభావం పడే గ్రామాలకు వెంటనే పరిహారం చెల్లించాలని ఆదేశించారు. ఈ పనులు పూర్తయితే బస్వాపూర్, గౌరవెల్లి ప్రాజెక్టుల్లో నీటిని నింపే అవకాశం ఉంటుందని సీఎం తెలిపారు. గట్టు, గూడెందొడ్డి ఎత్తిపోతల సామర్థ్యం పెంపుపై సమగ్ర అధ్యయనం చేయాలని, గూడెందొడ్డి పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుకు కన్సల్టెంట్‌ను నియమించాలని ఆదేశించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఉప్పాడ తీర రక్షణకు ఐఐటీ-మద్రాస్‌తో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ...

ఉప్పాడ తీర రక్షణకు ఐఐటీ-మద్రాస్‌తో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ...

వయసు ఒక నంబర్ మాత్రమే -హీరోయిన్ సమీరా రెడ్డి తండ్రి

వయసు ఒక నంబర్ మాత్రమే -హీరోయిన్ సమీరా రెడ్డి తండ్రి

బాంకీపూర్ నిరుద్యోగులకు ప్రశాంత్ కిశోర్ బిగ్ ఆఫర్

బాంకీపూర్ నిరుద్యోగులకు ప్రశాంత్ కిశోర్ బిగ్ ఆఫర్

ఒరాకిల్‌లో మరోసారి లేఆఫ్స్?

ఒరాకిల్‌లో మరోసారి లేఆఫ్స్?

ఏపీ మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ..

ఏపీ మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ..

ట్యాగ్లు
రేవంత్ రెడ్డిగోదావరి జలాలుతెలంగాణ నీటిపారుదలనీటిపారుదల ప్రాజెక్టులుదేవాదుల ప్రాజెక్టుసీతారామ ప్రాజెక్టుఎల్లంపల్లి ప్రాజెక్టుమేడిగడ్డ బ్యారేజీఎన్డీఎస్ఏతెలంగాణ ప్రభుత్వం
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
తన కలల ప్రయాణంపై సమంత ఎమోషనల్ పోస్ట్...

తన కలల ప్రయాణంపై సమంత ఎమోషనల్ పోస్ట్...

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భర్త పాదాలకు పూజ చేసిన హీరోయిన్ ప్రణీత..
జనరల్

భర్త పాదాలకు పూజ చేసిన హీరోయిన్ ప్రణీత..

“ఇరుముడి మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది”- ట్రైలర్ లాంచ్‌లో రవితేజ
సినిమాలు

“ఇరుముడి మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది”- ట్రైలర్ లాంచ్‌లో రవితేజ

గోదావరి జలాలను గ‌రిష్ట స్థాయిలో వినియోగించుకోవాలి- సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

గోదావరి జలాలను గ‌రిష్ట స్థాయిలో వినియోగించుకోవాలి- సీఎం రేవంత్ రెడ్డి

ఉప్పాడ తీర రక్షణకు ఐఐటీ-మద్రాస్‌తో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ...
జనరల్

ఉప్పాడ తీర రక్షణకు ఐఐటీ-మద్రాస్‌తో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ...

వయసు ఒక నంబర్ మాత్రమే -హీరోయిన్ సమీరా రెడ్డి తండ్రి
జనరల్

వయసు ఒక నంబర్ మాత్రమే -హీరోయిన్ సమీరా రెడ్డి తండ్రి

బాంకీపూర్ నిరుద్యోగులకు ప్రశాంత్ కిశోర్ బిగ్ ఆఫర్
జనరల్

బాంకీపూర్ నిరుద్యోగులకు ప్రశాంత్ కిశోర్ బిగ్ ఆఫర్

ఒరాకిల్‌లో మరోసారి లేఆఫ్స్?
జనరల్

ఒరాకిల్‌లో మరోసారి లేఆఫ్స్?

జియో ఫైనాన్స్‌లో మెజారిటీ షేర్ కొన్న విదేశీ బ్యాంక్
బిజినెస్

జియో ఫైనాన్స్‌లో మెజారిటీ షేర్ కొన్న విదేశీ బ్యాంక్

ముంబై రియల్ ఎస్టేట్‌లో కండిషన్ అప్లై తో కొత్త డీల్
బిజినెస్

ముంబై రియల్ ఎస్టేట్‌లో కండిషన్ అప్లై తో కొత్త డీల్

శంకర్ డైరెక్షన్ లో అజిత్ కుమార్ మూవీ ?
గాసిప్స్