

నటుడు సోనూ సూద్ విమానాశ్రయ అధికారులు, ఎయిర్‌పోర్ట్ లాంజ్ నిర్వాహకులు, మాల్స్, హోటల్ యాజమాన్యాలు, హాస్పిటాలిటీ రంగానికి చెందిన సంస్థలకు ఒక విజ్ఞప్తి చేశారు. ఎయిర్‌పోర్ట్ కౌంటర్లు, లాంజ్‌లు, హోటల్ రిసెప్షన్లు, సర్వీస్ డెస్క్‌ల వద్ద పనిచేసే సిబ్బంది రోజుకు 10–12 గంటల పాటు నిలబడే విధంగా విధులు నిర్వహిస్తున్నారని గుర్తుచేశారు. చిరునవ్వుతో కస్టమర్లకు సేవలందించే ఉద్యోగులకు ఇది శారీరకంగా ఎంత అలసట కలిగిస్తుందో ఆలోచించాలని సూచించారు.
ప్రతి కార్యాలయంలోనూ ఎత్తైన స్టూల్ లేదా తగిన కూర్చునే సదుపాయం తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సోనూ సూద్ అభిప్రాయపడ్డారు. పని అనుమతించిన సమయంలో ఉద్యోగులు కూర్చుని విశ్రాంతి తీసుకునే అవకాశం ఉండాలని కోరారు. కస్టమర్లకు సౌకర్యం కల్పించే సంస్థలు తమ సిబ్బంది సౌకర్యం, గౌరవం గురించి కూడా ఆలోచించాలని పేర్కొన్నారు. విశ్రాంతి అనేది ప్రత్యేక హక్కు కాదని, అది ప్రతి ఉద్యోగికి దక్కాల్సిన కనీస గౌరవం, మానవీయ హక్కు అని చెబుతూ ఈ విధానాన్ని పరిశ్రమ అంతటా అమలు చేయాలని పిలుపునిచ్చారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!